యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం, మరోవైపు కరోనా వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
కాగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ ని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఒకవేళ కియారా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆమె స్థానంలో రష్మిక ను తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. ఇక ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎన్టీఆర్ తో జత కట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.