గ్రజియా మిలీనియం అవార్డ్స్- 2022 కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తారలు తమ అందాలతో మరిన్ని రంగులు అద్దారు.
ఇందులో జాన్వీ కపూర్ సిల్వర్ బాడీకాన్ గౌన్ లో మెరిసిపోగా, బ్లాక్ గౌన్ లో మలైక అరోరా వచ్చి అట్రాక్ట్ చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో కైరా అధ్వానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిరుమిట్లు గొలిపే బ్లూ అవుట్ ఫిట్ లో ఆమెను చూసి అందరూ ఫిదా అయిపోయారు.
నయూమ్ ఖాన్ డిజైన్ చేసిన బ్లూ సెక్విన్ జంప్ సూట్ లో నడిచి వస్తున్న ఆమెను చూసి చూపులు తిప్పుకోలేకపోయారు.