‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది కియారా అద్వానీ. ఆ సినిమా వెంటనే రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే బాలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్ హీరోలతో ఆఫర్లు రావటంతో బాలీవుడ్‌కే ఈ అమ్మడు పరిమితమైంది. ప్రస్తుతం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో ఇరగదీస్తోంది. హిట్, ఫ్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది కియారా.
ప్రస్తుతం కియారా అద్వానీ నటించిన ‘భూల్ భూలయ్యా 2’, ‘ జగ్ జగ్ జీయో’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ బ్యూటీ తన సినిమా ప్రయోషన్స్‌లో బిజీగా ఉంటుంది. ఇందు కోసం సోషల్ మీడియాలోనూ లేటెస్ట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మతిపోయే ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఈ సందర్భంగా హీరోయిన్ కియారా అద్వానీ,యంగ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఇక ఈ కార్యక్రమానికి ఈ బ్యూటీ ఇండో వెస్టన్ హాట్ లుక్స్‌తో విచ్చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ అమ్మడి క్లీ వేజ్ షో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి ఈ భామ న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక జూన్ 24న ‘జగ్ జగ్ జీయో’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అలాగే, ‘భూల్ భూలయ్యా 2’ మే 20న విడుదల కానుంది. అలాగే, కియారా చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ ఆర్సీ 15లో మరోసారి చెర్నీ సరసన నటిస్తోంది.