బాలీవుడ్ లో మరో హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియరా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీళ్లిద్దరూ మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.
షేర్షా సినిమాతో సిద్, కియరా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఏ ముహూర్తాన కలుసుకున్నారో కానీ వెంటనే కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే, ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికే ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి.
ఆ వదంతులను ఇద్దరూ ఖండించలేదు. అలానే కొనసాగించారు. ఆ తర్వాత మాల్దీవులు వెళ్లేంతవరకు వచ్చింది వ్యవహారం. అలా ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకొని, ఇప్పుడు పెళ్లితో ఒకటయ్యారు.
జైసల్మేర్ లోని ఓ కాస్ట్లీ రిసార్ట్ లో కియరా-సిద్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, బాలీవుడ్ ప్రముఖులు భారీగా విచ్చేశారు. 12వ తేదీన ముంబైలో రిసెప్షన్ ఏర్పాట్లు చేయిస్తోంది ఈ జంట.