ఈగ, సైరా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కన్నడ స్టార్ సుదీప్. ఒకవైపు హీరోగా, మరో వైపు విలన్ గా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అనూప్ భండారీ దర్శకత్వంలో ప్రస్తుతం ఫాంటమ్ అనే సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ వలన చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ పడగా, ఇటీవల ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫాంటమ్ చిత్రంలో విక్రాంత్ రోనా అనే పాత్ర పోషిస్తున్న సుదీప్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇందులో సుదీప్ చేతిలో గన్ పట్టుకొని రాయల్‌గా కూర్చొని ఉన్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.