మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లో నటించనున్నాడు. రీసెంట్ గా ఆచార్య మూవీకు సంబంధించిన టీజర్ విడుదలైంది. అలాగే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారట.
సుదీప్ ఇప్పటికే తెలుగులో కొన్ని చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లో కనిపించిన సంగతి తెలిసిందే.