కాంగ్రెస్, బీజేపీ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారి గానూ మారుస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్ లోని భరూచ్ లో ఏర్పాటు చేసిన ఆదివాసీ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ లపై కేజ్రీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు తమకు ఒక అవకాశం ఇస్తే వారి పేదరికాన్ని ఆప్ పోగొడుతుందని తెలిపారు. తమ పార్టీ పేదలకు అండగా ఉంటుందన్నారు.
తమకు అధికారమిస్తే ఐదేండ్లలో రాష్ట్రంలోని స్కూళ్లను మెరుగుపరుస్తామని.. ఒకవేళ అందులో విఫలమైతే మరోసారి తమకు అధికారం ఇవ్వకండని తెలిపారు. రాష్ట్రంలో పేపర్ లీక్ వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పేపర్ల లీక్ వ్యవహారంలో గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు.
ఒక్క పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించాలని సీఎం భూపేంద్ర పటేల్ కు సవాల్ విసురుతున్నట్టు తెలిపారు.