హోమ్ వర్క్ చేయకుండా ట్యూషన్ కు వచ్చిన ఓ పిల్లాడిని హోమ్ వర్క్ ఎందుకు చేయలేదని ఓ ఇంజక్షన్ ను చూపించి ఆడిగినప్పుడు ఆ పిల్లాడు భయపడుతూ అమాయకంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఓ పిల్లాడు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఇలానే మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి ….ఇప్పుడు ఈ పిల్లాడి మాటలను చూసి నెటీజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ఇంజక్షన్ ను చూపించగానే….వెళ్లలోపే హోమ్ వర్క్ కంప్లీట్ చేసి చూపిస్తానన్న పిల్లాడి మాటలు అతడి ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఇదొక్క రోజు వదలిపెట్టండీ అంటూ అతడు బతిమాలిన విధానం కూడా చాలా ఫన్నీగా ఉంది. ఓ సారి ఈ వీడియో చూడండి.