నాంపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ గౌస్ పాషాను కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. ఐదు గంటల్లోనే కేసుని ఛేదించామని పోలీసులు తెలిపారు. షేక్ పాషా కిడ్నాప్ అయినట్టు 3.30గంటలకు అతని సన్నిహితుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. నారాయణ గూడాలోని ఈడెన్ గార్డెన్ లో ఓ పెళ్లికి హాజరైన సమయంలో రాత్రి గంట12.10ని లకు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నప్ చేశారు.
వెంటనే దర్యాప్తు మొదలు పెట్టి మొయినాబాద్ పరిసర ప్రాంతాలలో పాషాని గుర్తించామని పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.50లక్షల వివాదం కారణంగా ఈ కిడ్నాప్ జరిగిందని అన్నారు. కిడ్నాప్ చేసిన వారి నుంచి గౌస్ కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతున్నాడు.
అయితే.. నిన్న ఓ పెళ్లిలో ఉన్నాడని కిడ్నాపర్లకు సమాచారం రావడంతో అతన్ని పట్టుకొని మోహినాబాద్ కి తరలించారు. పాషా కిడ్నాప్ వ్యవహారం టీవీల్లో రావడం,కేసు ఫైల్ అవ్వడంతో భయపడిన దుండగులు ఆయన కూతురికి ఫోన్ చేపించి ఒక గంటలో వస్తానని చెప్పించారు.
Advertisements
పాషా అల్లుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతను మొయినాబాద్ లో ఓ షెడ్లో ఉన్నట్లు గుర్తించారు. తాము వెళ్లే సరికి డబ్బుల కోసం మాట్లాడుతున్నారని పోలీసులు చెప్పారు. గౌస్ పాషాకు ఎలాంటి గాయాలు, దెబ్బలు లేవని తెలిపారు. మొత్తం ఐదుగురి కిడ్నాపర్లను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌస్ ని కూడా అదుపులోకి తీసుకుని నారాయణ గూడ పోలీసు స్టేషన్ కు తరలించారు.