అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. అసలు సాధారణ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా ఒక ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. గతంలో అంతర్జాతీయ మ్యాచ్‌లలో సౌతాఫ్రికాకు చెందిన ఆటగాడు హెర్షల్ గిబ్స్, భారత ప్లేయర్ యువరాజ్ సింగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక తాజాగా వెస్టిండీస్ ఆటగాడు కిరన్ పొల్లార్డ్ కూడా ఆ జాబితాలో చేరాడు. శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒక ఓవర్ లో పొల్లార్డ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు.
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న శ్రీలంక ఆ జట్టుతో గురువారం మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. అందులో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
Beast Power Kieron Pollard hits Akila Dhananjaya for Six Sixes in a single over hitting some of the amazing shots in the park. Enjoy the ride.#Mumbai #mumbaiindians @mipaltan#WIvSL #Pollard #Sixers #ViralVideo pic.twitter.com/KOqrdUj8QE
— 🌿Epitomethinker🌿💫 (@Epitomethinker) March 4, 2021
అయితే విండీస్ ఇన్నింగ్స్‌లో పొల్లార్డ్ అద్భుతంగా రాణించాడు. 11 బంతుల్లోనే 6 సిక్సర్లతో 38 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. శ్రీలంక బౌలర్ అకిల దనంజయ 6వ ఓవర్ వేయగా అప్పుడు విండీస్ 4 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి కష్టాల్లో పడింది. అయితే ఆ ఓవర్‌లో పొల్లార్డ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడు. దీంతో విండీస్ సునాయాసంగా ఆ మ్యాచ్ లో విజయం సాధించింది. ఇక ఈ ఫీట్‌ను సాధించడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లను బాదిన మూడో క్రికెటర్‌గా పొల్లార్డ్ నిలిచాడు. అంతకు ముందు 2007 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా ప్లేయర్ హెర్షల్ గిబ్స్ నెదర్లాండ్స్‌పై ఈ ఘనత సాధించగా.. తరువాత అదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై భారత ప్లేయర్ యువరాజ్ సింగ్ ఆ ఘనతను సాధించాడు. ఇప్పుడు పొల్లార్డ్ అదే ఘనత సాధించి వారి సరసన నిలిచాడు.