ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో 5 ముఖ్య రాజధానులను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ బలగాలను ఓడిస్తూ ఆఫ్గన్ ను తమ వశం చేసుకున్నారు. అంతేకాకుండా తమ మూర్ఖత్వంతో అమాయక ప్రజలను టార్చర్ పెడుతున్నారు. ఇటీవల ఓ కమెడియన్ నవ్విస్తాడని అది ఖురాన్ కు విరుద్ధమని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అయితే తాజాగా మరోసారి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారు.
Advertisements
బాల్క్ ప్రావిన్స్ లో ఓ యువతి టైట్ గా ఉండే దుస్తులను ధరించడమే కాకుండా మగతోడు లేకుండా బయటకు వచ్చింది అనే కారణంతో కాల్చిచంపారు. అయితే దాడి జరిగిన సమయంలో ఆ యువతి బర్కా ధరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తమ నియంత్రణ లో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ మహిళలు బిగుతుగా ఉండే బట్టలు ధరించి బయట పని చేయవద్దని హుకుం జారీ చేశారు. మరోవైపు ఇటీవల తాలిబాన్లు తాము జిహాద్ కోసం పోరాడుతున్నామని తాము వీరులని తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలను ఇవ్వాలని కొంతమందిని ఎత్తుకెళ్లి మరీ వివాహం చేసుకున్నారు.