ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్స్ లో ఒకటైన మెట్ గాలా-2022 సోమవారం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది మే మొదటి సోమవారం ఈ ఫ్యాషన్ ఈవెంట్ ను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్, ఫ్యాషన్, కళారంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఫ్యాషన్ లో పాల్గొంటారు. వారంతా వినూత్నమైన ఫ్యాషన్ దుస్తులు ధరించి అభిమానులకు కనువిందు చేస్తారు.
ఈ ఫ్యాషన్ లో ఈ సారి టీవీ నటి కిమ్ కర్దాషియాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అత్యంత ఖరీదైన బంగారు రంగు గౌన్ లో ఆమె మెరిసిపోతుంటే ప్రేక్షకులు చూపు తిప్పుకోలేకపోయారు
ఆ గౌన్ లో ఆమె అటు ఇటు క్యాట్ వాక్ చేస్తూ ఉంటే అలనాటి యాక్టర్ మర్లిన్ మన్రో గుర్తుకు వచ్చారు.19 మే 1962న ఇదే డ్రెస్సును మర్లిన్ మన్రో కూడా ధరించారు.దీంతో అందరు ఒక సారి గతాన్నిగుర్తుచేసుకున్నారు.
ఈ డ్రెస్సుకు ఓ ప్రత్యేక ఉంది.గతంలో ఈ డ్రెస్సును వేలం వేయగా అత్యధికంగా 4.8 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది.అయితే ఈ డ్రెస్సు ధరించేందుకు కిమ్ మూడు వారాల్లో 7 కిలోలు తగ్గారు.