ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరుగుతోంది డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడ్డ సినీ అభిమానులు వెబ్ సిరీస్ లను ఎంజాయ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది స్టార్ హీరోయిన్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇటీవల విడుదలైన ది బేకర్ అండ్ ది బ్యూటీ వెబ్ సిరీస్ కు మంది పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
కాగా ఈ వెబ్ సిరీస్ పై స్టార్ హీరో అక్కినేని నాగార్జున స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ది బేకర్ అండ్ ది బ్యూటీ గురించి మంచిగా వుంటున్నాను అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన మొత్తం టీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇంతటి విజయం సాధించిన వెబ్ సిరీస్ పై సంతోషం వ్యక్తం చేశారు. సంతోష్ శోభన్, టిన శిల్ప రాజ్ మరియు విష్ణు ప్రియ లు ఈ సీరిస్ లో కీలక పాత్రల్లో నటించారు.