లండన్ లో ఓ వ్యక్తి సంచలనం స్రుష్టించాడు. అంతేకాదు విప్లవ నినాదాలు చేసాడు.గతనెలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కింగ్ ఛార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిలా పై కొంత మంది దుండగులు కోడిగుడ్లు విసిరారు.“ఈ దేశం బానిసల రక్తంతో నిర్మించబడింది నువ్వు నారాజు కాదు.” అంటూ గొంతెత్తి నినాదాలు చేసాడు. ఈ దుష్చర్యకు పాల్పడిన 20 యేళ్ళ యువకుడిని ఎట్టకేలకు ఈ బుధవారం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
కొంతమంది నాయకులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలను కలవడానికి, కొత్తసిక్కు ఆలయాన్ని తెరవడానికి,కొత్త ప్రజారవాణా వ్యవస్థను సందర్శించడానికి ఛార్లెస్ III లూటాన్ నగరంలో ఉన్నారు. అయితే దుండగుణ్ణి లూటాన్ టౌన్ హాల్ బైట అరెస్ట్ చేసి విచారణ కోసం తరలించినట్లు బెడ్ ఫోర్ట్ షైర్ పోలీసులు తెలిపారు. గత నవంబర్ 9 ఉత్తర ఇంగ్లండ్ లోని యార్క్ నగరంలో తనతల్లి క్వీన్ ఎలిజిబెత్ II విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఛార్లెస్, కెమిల్లా యార్క్ నగరానికి చేరుకున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితుడు బెయిల్ పై విడుదల అయ్యాడు.
సెప్టెంబర్ లో కింగ్ చార్లెస్ తల్లిక్వీన్ ఎలిజిబెత్ ప్రాణాలు కోల్పోయారు. 10 రోజుల జాతీయ సంతాపం అనంతరం ఖననం చేసారు. కానీ వంశపారంపర్య సూత్రానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కింగ్ ఛార్లెస్ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు.
బంకింగ్ హామ్ ప్యాలెస్ గత వారం జాత్యాహంకారానికి సంబంధించిన తాజా ఆరోపణలను ఎదుర్కోవాల్సివచ్చింది. ఒక నల్లజాతి బ్రిటీష్ చారిటీ వర్కర్ ను ఆమె ఎక్కడనుంచి వచ్చిందని న్యాయస్థానం పదేపదే ప్రశ్నించడానికి నిరసనగా సదరు నిరసనలు జరిగాయి. కాగా కోడిగుడ్డు విసిరన వ్యక్తిపై విచారణ జరగనుంది.