సీతారామం సినిమా తరువాత దుల్కర్ సినిమాల విషయంలో జోరు పెంచాడు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీతో సహా అన్ని భాషలలో ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్నాడు. ప్రస్తుతం అతని చేతి నిండా చిత్రాలున్నాయి. నటుడు-నిర్మాత ఇప్పుడు తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కోత షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో అభిలాష్ జోషి నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే యాక్షన్ కథగా కింగ్ ఆఫ్ కోతా చెప్పబడుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను విడుదల చేసింది. కేరళలోనే అత్యంత పెద్ద పండుగ అయిన ఓనం సీజన్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంటే 2023 ఆగస్టులో విడుదల కానున్నట్లు అంచనా. మళయాల సినిమా చరిత్రలో అతి పెద్ద ప్రాజెక్టుగా దీనిని చెప్పుకోవచ్చు.
ఈ చిత్రంలో విలన్ పాత్రకి తమిళ నటుడు ప్రసన్న ని తీసుకున్నట్లు సినిమా వర్గాలు ధృవీకరించాయి. ఈ చిత్రంలో దుల్కార్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్లున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అభిలాష్ జోషి తండ్రి జోషి కూడా ప్రముఖ నిర్మాత. అంతేకాకుండా ఆయనకి ముమ్ముట్టితో మంచి సంబంధాలు ఉన్నాయి. మరో విశేషం ఏంటి అంటే దుల్కార్, అభిలాష్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కూడా.
ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. మరో నటి సంయుక్త మీనన్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోంది. షబీర్ కల్లారకల్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, గోకుల్ సురేష్, శాంతి కృష్ణ, సుధీ కొప్పా, సెంథిల్ కృష్ణ తదితరులు సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సాంగ్ సీక్వెన్స్‌లో ప్రముఖ నటి రితికా సింగ్ ప్రత్యేకంగా కనిపించనుంది.
‘కురుప్’ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి, విజువలైజేషన్ హ్యాండిల్ చేయడం ద్వారా కింగ్ ఆఫ్ కొత్త కోసం దుల్కర్ సల్మాన్ మరియు టీమ్‌తో మళ్లీ కలుస్తున్నారు. షాన్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ కోసం పాటలు , ఒరిజినల్ స్కోర్‌ను కంపోజ్ చేస్తున్నాడు. శ్యామ్ శశిధరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. కింగ్ ఆఫ్ కోత దుల్కర్ సల్మాన్ హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీతో సహా ఐదు భాషలలో పాన్-ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.