భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సినిమా ఆర్ఆర్ఆర్. దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ఈసినిమా ప్రస్తుతం ఓటీటీలో తన హవా కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందుతోంది.రోజు రోజుకి ఈ చిత్రానికి విదేశీ ప్రేక్షకులలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
సాధారణ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ చిత్రాల రచయితలు, నిర్మాతలు ఆర్ఆర్ఆర్ చూశాక వారి సంతోషాన్ని తెలపడమే కాకుండా తమ స్నేహితులు, సన్నిహితులకు కూడా చిత్రాన్ని చూడమని చెబుతున్నారు.
తాజాగా హాలీవుడ్ దిగ్గజ రైటర్, నిర్మాత కీరా స్నైడర్ ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఈచిత్రంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై చిరుత, పులి సన్నివేశాలపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రతి సీన్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయనే మాటలు ఏ మాత్రం సరిపోవని చెప్పారు.
ఎవరూ ఈ సినిమాను మిస్ కావొద్దని చెప్పింది కీరా. అందరూ స్నేహితులతో కలిసి చూసి ఎంజాయ్ చేయండని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
పూర్తి కథనం..