యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.
ఇప్పుడు, కిరణ్ తన మూడవ చిత్రం సెబాస్టియన్ PC 524తో మరో హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. కామెడీ-డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో కిరణ్ రాత్రి సమయంలో కళ్ళు కనిపించని కానిస్టేబుల్ పాత్రను పోషించాడు. తన తల్లికి ఇచ్చిన మాట కోసం పోలీస్ గా తన వైకల్యాన్ని ఎలా అధిగమించాడు, కేసులను ఎలా పరిష్కరించాడు అనేది సినిమా కథ.
ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మరి కిరణ్ ఆ అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.
బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన సెబాస్టియన్ PC 524 లో నువేక్ష, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్ గా ఇందులో నటించగా జిబ్రాన్ సంగీతం అందించారు.