టాలెంటెడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పిసి 524 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పటికే వరుస సినిమాలను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో తాజాగా మరో కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశాడు.
నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రంగురంగుల దుస్తులలో కిరణ్ కనిపించాడు.
ఇక ఈ సినిమాకు కార్తీక్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందించారు.
రాజావారు రాణిగారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో ఇటీవల ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలు కూడా యూత్ లో కిరణ్ కు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.