యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తొలి చిత్రం రాజా వారు రాణి గారుతో మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత రెండవ చిత్రం SR కళ్యాణమండపంతో మరో హిట్ సాధించాడు. ఇక ఇప్పుడు మూడవ చిత్రం సెబాస్టియన్ PC 524తో హ్యాట్రిక్ సాధించాలని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా మిగిలింది.
సెబాస్టియన్ పిసి 524 ఫిబ్రవరి 25న విడుదల కావాల్సి ఉండగా అదే రోజు భీమ్లా నాయక్ విడుదల చేయడంతో వాయిదా పడింది. చివరకు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లుతో క్లాష్ అయ్యి మార్చి 4న తెరపైకి వచ్చింది. సరైన బజ్ లేకపోవడంతో, సెబాస్టియన్ బాక్సాఫీస్ వద్ద పేలవమైన ఓపెనింగ్స్ అందుకుంది.
ఇక తాజా నివేదికల ప్రకారం, ఆక్యుపెన్సీ లేకపోవడంతో బి, సి సెంటర్లలో చాలా షోలు రద్దు చేయబడుతున్నాయట. కొన్ని థియేటర్లలో కేవలం రూ.1000-2000 మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
మరి కిరణ్ తన తదుపరి సినిమాతో అయిన హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.