రాజావారు-రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో హిట్ కొట్టాడు. ఆ సినిమా దెబ్బతో ఈ హీరో చేతిలో ఏకంగా ఇప్పుడు 8 సినిమాలొచ్చి పడ్డాయి. వీటిలో 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అవ్వగా.. మరో 6 సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సెబాస్టియన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ వచ్చిన కొన్ని నెలల గ్యాప్ లోనే అబ్బవరం నటించిన సమ్మతమే సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. సెబాస్టియన్ సినిమా కాన్సెప్ట్ మూవీ కాగా.. సమ్మతమే సినిమా పూర్తి ప్రేమకథాచిత్రం.
ఈ రెండు సినిమాలతో పాటు కిరణ్ అబ్బవరం చేతిలో ఉన్న మిగతా సినిమాలేంటో చూద్దాం. తన 5వ చిత్రంగా కోడి రామకృష్ణ బ్యానర్ పై ఆయన కూతురు దివ్య నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. నేను మీకు బాగా కావాల్సినవాడ్ని అనేది ఈ సినిమా టైటిల్.
ఇక 6వ చిత్రంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. 7వ చిత్రాన్ని గీతాఆర్ట్స్-2లో, 8వ చిత్రాన్ని ఏఎం రత్నంకు, 9వ సినిమాను ఏషియన్ సినిమాస్ బ్యానర్ కు, 10వ సినిమాను ప్రైమ్ షో ఎఁటర్ టైన్ మెంట్స్ అనే సంస్థకు చేయబోతున్నాడు ఈ హీరో.
Advertisements
ప్రస్తుతం ఈ సినిమాల ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ సాగుతున్నాయి. మినిమం గ్యాప్స్ లో ఒక్కో సినిమా వివరాలు బయటకు రాబోతున్నాయి. ఇలా ఒకేసారి చేతిలో 8 సినిమాలున్న హీరో ప్రస్తుతం టాలీవుడ్ లో కిరణ్ అబ్బవరం మాత్రమే.