కిరణ్ సేతీ…. ఎందరో సెX వర్కల్ల జీవితాల్లో వెలుగులు నింపిన పోలీస్ ఆఫీసర్! మొదటి సారి ASI గా విధుల్లో చేరగానే ఢిల్లీ ప్రాంతంలో ఉన్న సెX వర్కల్ల జీవితాలను అధ్యయనం చేయడం ప్రారంభించింది. వారు ఆ వృత్తిలోకి రావడానికి గల కారణాలు అన్వేషించి… మొదటగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసింది.
మహిళలు, అమ్మాయిలు సెX వర్కర్స్ గా మారడానికి ప్రధాన కారణం పేదరికమని అర్థం చేసుకున్న కిరణ్ …అనేక NGOల సహాయంతో స్వయం ఉపాధి కల్పించే పనులను వారికి నేర్పి, వారి చేత చిన్నచిన్న వ్యాపారాలు పెట్టించి ప్రోత్సాహించింది. సెX వర్కర్స్ కు పుట్టిన పిల్లలను చేరదీసి వారికి చదువుచెప్పించడమే కాక….వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కరాటే, యోగాలను నేర్పింది. మహిళా ఆత్మరక్షణ సంస్థను స్థాపించిన కిరణ్ ఇప్పటి వరకు 6 లక్షల అమ్మాయిలకు జూడోలో ట్రైనింగ్ ఇచ్చారు.