శివసేన నేత సంజయ్ రౌత్ కు బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ షాక్ ఇచ్చారు. రౌత్ పై ఆమె పరువు నష్టం దావాను దాఖలు చేశారు. బాంబే హైకోర్టులో రూ. 100 కోట్లకు ఆయనపై పరువు దావాను వేశారు.
మీరా బయాందర్ మున్సిపాలిటీ పరిధిలో టాయిలెట్ల నిర్మాణంలో రూ. 100కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేత కిరీట్ సోమయ్యతో పాటు ఆమె భార్యపై సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు.
ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు. పరువు నష్టం దావా ద్వారా వచ్చే డబ్బును సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్టు కిరీట్ సోమయ్య వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వాటికి వారిద్దరూ సమాధానం చెప్పితీరాల్సిందేనని పేర్కొన్నారు.