హాలీవుడ్ లోని “చీర్స్’’ మూవీలో నటించి రెబెక్కాహోవే పాత్రకు ప్రాణం పోసిన ప్రముఖనటి కిర్స్టీఅల్లీ(71) తుడిశ్వాశ విడిచారు.క్యాన్సర్ తో అలుపెగని పోరాటం చేసిన ఆమె సోమవారం రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారని కిర్స్టీ కుమారుడు, కుమార్తె సోషల్ మీడియాలో స్పందించారు. అమ్మకు క్యాన్సర్ ఉందని ఇటీవలే గుర్తించామని.
‘ఆమె ఇన్నాళ్లూ గొప్పగా పోరాడిందని, ఆమె జీవితంలోని అంతులేని ఆనందాలను తమకు వదిలేసి వెళ్లిపోయిందని, మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌లోని వైద్యులు, నర్సుల బృందం ఆమెకు అద్భుతమైన చికిత్స అందించారని, వారికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు సోషల్ మీడియాలో వేదికగా తమ ఆవేదనను పంచుకున్నారు.నటి కిర్‌స్టీ అల్లీ 1970లో బాబ్ అల్లీని వివాహం చేసుకున్నారు.
1977లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత పార్కర్ స్టీవెన్‌సన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అల్లీ 1987 నుంచి 1993 వరకు ఎన్బీసీ సిట్‌కామ్ ‘‘చీర్స్’’లో రెబెక్కా హోవే పాత్రను పోషించి మంచి గుర్తింపు పొందారు. ఈ పాత్ర కోసం ఆమె 1991లో ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్‌ను అందుకున్నారు. ఆమె ‘‘డ్రాప్ డెడ్ గార్జియస్’’, ‘‘వెరోనికాస్ క్లోసెట్’’, ‘‘ఇట్ టేక్స్ టూ’’, ‘‘సిబ్లింగ్ రివాల్రీ’’, ‘‘షూట్ టు కిల్’’, ‘‘లవర్ బాయ్’’, ‘‘రన్ అవే’’ వంటి డజన్ల సినిమాలు చేశారు. టీవీ కార్యక్రమాల్లో హోస్ట్ గా కూడా వ్యవహరించారు.
సహనటుడు జాన్ ట్రావోల్టా విచారం వ్యక్తంచేస్తూ ‘‘కిర్‌స్టీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది’’ అని పేర్కొన్నారు. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను కిర్‌స్టీ. మనం మళ్ళీ ఒకరినొకరు చూస్తామని నాకు తెలుసు’’ అని ఇన్‌స్టా గ్రామ్ లో తన విచారాన్ని ,విశ్వాసాన్ని వ్యక్తం చేసారు.