సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సింగర్ జోనితా గాంధీల మధ్య రిలేషన్ షిప్ ఉందని, త్వరలోనే వారు పెళ్లి చేసుకుంటారని నిన్న మొన్నటి వరకు రూమర్స్ వచ్చాయి. దీంతో వారి పెళ్లి ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే పరిమాణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జోనితా స్థానంలో ప్రస్తుతం నటి కీర్తి సురేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అనిరుద్, కీర్తి సురేష్‌లు త్వరలో వివాహం చేసుకుంటారని ఇప్పుడు మళ్లీ వార్తలు ప్రచారం అవుతున్నాయి.
అనిరుధ్ బర్త్ డే వేడుకలో ఇటీవల కీర్తి సురేష్ అతనితో కలిసి కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే కీర్తి సురేష్‌కు ఓ వ్యాపారవేత్తతో వివాహం అవుతుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఆ విషయంపై ఆమెగానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ప్రస్తుతం ఆమెకు, అనిరుధ్‌కు మధ్య రిలేషన్ షిప్ ఉందని మళ్లీ వార్తలు మొదలయ్యాయి. దీంతో వీరిద్దరి వివాహం అయినా జరుగుతుందా, లేదా.. అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తమిళంలో అన్నాత్తే, సాని కాయిధమ్ అనే మూవీలు చేస్తుండగా, తెలుగులో గుడ్ లక్ సఖి, రంగ్ దె, సర్కారు వారి పాట, అయినా ఇష్టం నువ్వు అనే మూవీల్లో నటిస్తోంది. మరోవైపు అనిరుధ్ మాస్టర్ విజయం తరువాత అనేక ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. శివకార్తికేయన్‌కు చెందిన డాక్టర్, కమల హాసన్ విక్రమ్, ఇండియన్ 2 మూవీలు, విజయ్ తలపతి 65, విజయ్ సేతుపతి-నయనతార-సమంతల కాతువాకుల రెండు కధల్ అనే మూవీలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.