కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై పోరాటం ఓవైపు తీవ్రమవుతుంది. ఈ ఉద్యమ వివరాలను దేశవ్యాప్తం చేస్తూ, ఎప్పటికప్పుడు ఉద్యమ వివరాలను అందిస్తూ, ప్రత్యక్ష ప్రసారాలను కూడా అందించే రైతుల తమ ఫేస్‌బుక్ పేజీ కిసాన్ ఏక్తా మోర్చాను ఫేస్ బుక్ బ్లాక్ చేయటం వివాదాస్పదం అవుతోంది. 1.60లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న ఈ పేజ్… ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేశారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.
రైతుల ఆరోపణలపై ఫేస్ బుక్ స్పందించింది. కిసాన్ ఏక్తా మోర్చా పేజ్ పొరపాటున బ్లాక్ అయిందని, సాంకేతిక కారణాలే ఇందుకు కారణమని తెలిపింది. పేజ్ యాక్టివిటి ఒక్కసారిగా పెరిగిపోవటంతో ఆటోమేటెడ్ సిస్టం బ్యాన్ చేసిందని తెలిపింది. అయితే, రివ్యూ అనంతరం తమ టెక్నిషియన్స్ మూడు గంటల్లోపే పేజ్ ను పునరుద్దరించినట్లు తెలిపింది. ఇన్ స్టా అకౌంట్ మాత్రం యాధావిధిగా కొనసాగిందని ఎఫ్.బీ పేర్కొంది.