మెట్రో ట్రైన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో మెట్రో ట్రైన్ ప్రారంభోత్సవం జరిగితే తనకు సమాచారం ఇవ్వరా అని ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే తనకు ఆహ్వానం పంపలేదని ఆయన సీరియస్ అయ్యారు. ఈమేరకు తనకు ఆహ్వానం లేకపోవడంపై మెట్రో అధికారులతో కిషన్ రెడ్డి సమావేశమై వివరణ తీసుకున్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారు. అధికారులు రాజకీయ పరమైన వ్యవహారాల్లో తలదూర్చవద్దని హితవు పలికారు. మెట్రోలో కేంద్రం భాగస్వామ్యం ఉందని చెప్పేందుకు కిషన్ రెడ్డి, బీజేపీ నేత రామ్ చందర్ రావు పర్యటించాల్సి ఉంది. కానీ మెట్రో ట్రైన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంతో ఆయన మెట్రోలో ప్రయాణించేందుకు నిరాకరించారు.