టీఆర్ఎస్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం అందిస్తున్న నిధుల విషయంలో సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
స్మార్ట్ సిటీలకు కేంద్రం ఇస్తున్న నిధులపై ఆయన స్పష్టత నిచ్చారు. వరంగల్, కరీంనగర్ నగరాలకు స్మార్ట్ సిటీ పనుల కోసం కేంద్రం ఇప్పటికే రూ. 392 కోట్లను విడుదల చేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ సిటీలకు తన వాటా 50 శాతం నిధులను ఇప్పటి వరకు విడుదల చేయలేదని మండిపడ్డారు. 2015 నుంచి ఇప్పటి వరకూ కేవలం రూ. 210 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
రాష్ట్రానికి అమృత్ పథకం కింద తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 2,780 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. నిధుల విషయంలో కేసీఆర్ సర్కార్ అతస్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.