తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం.. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలనేదానిపైనే పెడతామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లోని బీజేపీ నగర, రాష్ట్ర కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్ ఏడేళ్లుగా విమోచన దినోత్సవాన్ని మరిచారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఎంఐఎంకు కేసీఆర్ కుటుంబం హుజూర్.. సలాం.. అంటుందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వకార్యాలయాల్లో, అన్ని బస్తీల్లో విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా ఈ అంశంపై పోరాటం చేస్తున్నామని.., అధికారకంగా నిర్వహించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. తెలంగాణ విమోచన దినానికి వచ్చే ఏడాదితో 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడైనా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.