కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతోంది.
అడ్డగుట్టలో పాదయాత్ర చేసిన సందర్భంగా అక్కడి ప్రజలు కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికారు. కొందరు తమ సమస్యలను వివరిస్తూ అందించిన వినతి పత్రాలను కిషన్ రెడ్డి స్వీకరించారు. వాటిని అక్కడే పరిశీలించారు.
కిషన్ రెడ్డితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి నేడు పూర్తిగా సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోనే పర్యటించనున్నారు. రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో అడ్డగుట్ట, తుకారాం గేట్, మరాఠా బస్తీ, తార్నాక, లాలాపేట, వినోబానగర్, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో ఈ రోజంతా పర్యటిస్తారు.