నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా కిషోర్ తన తదుపరి చిత్రం రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారని ప్రకటించారు. ఇదే విషయం గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగ చైతన్య మెయిన్ హీరోగా నటించే అవకాశం ఉందని చెప్పారు.
ఇకపోతే నాగ చైతన్య త్వరలో దర్శకుడు పరశురామ్‌తో నాగేశ్వరరావు అనే సినిమా చేయనున్నాడని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. పరశురామ్ సర్కారు వారి పాటను పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం స్టార్ట్ చేయనున్నాడట.
అయితే నాగ చైతన్య కిషోర్ తిరుమల ప్రాజెక్ట్‌ని అంగీకరిస్తే, నాగేశ్వరరావు తరువాత ఈ సినిమాను చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య థ్యాంక్యూ సినిమాని పూర్తి చేశాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనితో పాటు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్‌లో కూడా చేస్తున్నాడు.