చదువులు, ఉద్యోగాల పేరుతో విదేశాల్లో సెటిల్ అయిన బంధువులంతా ఇబ్బంది పడేది ఫూడ్ తోనే.. ఎన్ని డబ్బులు పోసి కొనుక్కోగలిగిన మన మసాలాల ఘాటు మరెక్కడా దొరకదు..దాంతో సొంత ఊరొచ్చినప్పుడల్లా మర్చిపోకుండా మసాలా పొడులను కూడా ప్యాక్ చేయించుకుని తీసుకెళ్లే బంధువులను చూడగానే వచ్చిన ఆలోచనలో నుండి పుట్టిందే “సాంబార్ స్టోరీస్”..
కిచెన్ టు గ్యారేజ్
విప్రో(WIPRO)లో మంచి జాబ్..ఐదంకెల్లో జీతం వదిలేసుకుని మసాలాలు అమ్మాలని డిసైడ్ అయింది 29 ఏళ్ల స్నేహ సిరివర.. బెంగళూర్ కి చెందిన స్నేహ మొదట తన కిచెన్లో కొన్ని దినుసులను మసాల పొడులుగా చేసి వాటిని రిలేటివ్స్ కి ఇచ్చి రుచి చూసి చెప్పమనేది.. అందరి నుండి ఫర్ఫెక్ట్ అనే సమాధానం రావడంతో.. కిచెన్ టు గ్యారేజ్.. తన ఇంట్లోని గ్యారేజ్ లో చిన్నగా స్టార్ట్ చేసింది…తల్లిదండ్రి సహకారం కొంత ఉన్నప్పటికి అన్ని పనులు వన్ మాన్ ఆర్మిలా ఒక్కర్తే చేసుకునేది.
7 ఇయర్స్..2000 యూనిట్స్..50 ప్రొడక్ట్స్
ఇదంతా జరిగింది 2013లో..ఇప్పటికి సాంబార్ స్టోరీస్ స్టార్ట్ అయి ఏడేళ్లు.. ఈ ఏడేళ్లల్లో 2000 యూనిట్లకు తన ప్రొడక్ట్ ను సప్లై చేసే స్థాయికి ఎదిగింది..కంప్యూటర్ సైన్స్ చదివిన అమ్మాయి బిజినెస్ లో ఎలాంటి ఓనమాలు దిద్దకుండానే తన బిజినెస్ ని రోజురోజుకి అభివృద్ది చేసింది. సాంబార్ స్టోరీస్ లో సుమారు 50రకాల ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొంది..ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజసిద్దంగా తయారు చేసిన చట్నీపొడులు, మసాలా పొడులు, కాఫి పొడి, పచ్చళ్లు, రెడీ టు ఈట్ మిక్స్ లు ఇలా ఎన్నో మొత్తం 50 రకాల ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది స్నేహ… సాంబార్ స్టోరిస్ నుండి వచ్చే ప్రొడక్ట్స్ లో కాఫి పొడికి ప్రత్యేక అభిమానులున్నారు..
ఇంట్లో వాళ్లే ఫస్ట్ జడ్జెస్..
ఏదన్నా కొత్త ప్రొడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకుంటే ముందుగా దానిని వాళ్ల ఇంట్లోనే ఉపయోగిస్తుంది.. ఇంట్లో వాళ్లు తిన్న తర్వాత ఒకె చేస్తేనే తన కస్టమర్స్ కి నచ్చుతుందని భావిస్తుంది.. పెళ్లయిన తర్వాత అత్తగారు కూడా స్నేహకి తగ్గట్టుగానే దొరికారు..ఆవిడకు కూడా వంట చేయడం అంటే మహా ఇష్టం..ఇద్దరూ కలిసి వంటల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అవి స్నేహ మార్కెంటింగ్ కి ఉపయోగపడుతుంటాయి.స
తనతో పాటు మరికొంతమందికి ఉపాది..
ఒకప్పుడు ఒక్కరిగా స్టార్ట్ చేసిన సాంబార్ స్టోరిస్ లో ప్రస్తుతం ముగ్గురి సాయంతో రన్ అవుతుంది.. కేవలం స్పైసెస్ కాకుండా మురుకులు లాంటి తినుబండారాలను కూడా సప్లై చేయాలని భావించింది స్నేహ..అందుకోసం తమిళనాడులోని చిన్న గ్రామాల్లోని మహిళలతో వాటిని తయారు చేయిస్తుంది.. తనతో పాటు మరికొంతమందికి అండగా నిలబడుతుంది ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కమ్ ఎంటర్ ప్రెన్యూర్..మంచి కాఫి లాంటి అమ్మాయి..