ఐపీఎల్ లో ఒక జట్టు పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఉమేశ్ యాదవ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ పై ఉమేశ్ 34 వికెట్లు పడగొట్టడంతో ఈ రికార్డు ఆయన సొంతమైంది. అయితే ఉమేశ్ యాదవ్ కు వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ గా పేరుంది.
ఇక ఐపీఎల్ 2023 లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజపాక్సేను ఉమేశ్ అవుట్ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 191 పరుగులు చేయగా ఈ లక్ష్యచేధనలో కేకేఆర్.. 16 ఓవర్లు ముగిసేటప్పటికీ 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అయితే 29 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కేకేఆర్ కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ నితీశ్ రాణా ఆదుకునే ప్రయత్నం చేశారు. వరుణ్ చక్రవర్తి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ తో కలిసి నాలుగో వికెట్ కు రానా 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక బానుక రాజపక్స స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రిషి ధావన్ వేసిన 9వ ఓవర్లో నితీశ్ రాణా ఫోర్లు, సిక్స్ లు బాదాడు, కానీ రజ వేసిన ఓవర్ లో సెకండ్ బాల్ కి పెవిలియన్ చేరాల్సి వచ్చింది అతనికి.
అయితే రింకూ సింగ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆండ్రూ రసెల్ 19 బంతుల్లో 35 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టి వెంకటేశ్ అయ్యర్ కేకే ఆర్ ను విజయం వైపు నడిపించాడు. వీరిద్దరు ఆరో వికెట్ కు 30 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. నాథన్ ఎల్లీస్ వేసిన 14వ ఓవర్ లో రసెల్ ఓ ఫోర్ కొట్టగా అయ్యర్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. అయితే ఈ మ్యాచ్ కు వర్షం పెద్ద అడ్డంకిగా మారడంతో డక్ వర్త్ లూయిన్ పద్థతి ప్రకారం పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్టుగా అంపైర్లు ప్రకటించారు.