గత ఏడాది ఐపిఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ ఈ ఏడాది సీజన్ లో మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. టీం ఇండియా లో చోటు సంపాదించిన తర్వాత అయ్యర్ ఆటలో మార్పు కనపడుతుందని పట్టు కోల్పోయాడనే వ్యాఖ్యలు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అనే ప్రచారం జరుగుతుంది.
Also Read:డైవర్ట్.. ఎనీ డ్యామేజ్ న్యూస్.. దటీజ్ కేసీఆర్..!
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రియాంక ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె కర్టెన్‌ల వెనుక దాక్కున్నట్లుగా ఉంది. దీనిపై వెంకటేష్ స్పందిస్తూ కామెంట్ చేసాడు. దీనికి క్యూట్ అని కామెంట్ పెట్టడంతో… ఆమె మీరు ఎవరు అని అడిగింది. ఇక అక్కడి నుంచి వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సీజన్ లో అయ్యర్ 16, 10, 3 స్కోర్‌లతో పెద్దగా ఆకట్టుకోలేదు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ఆటగాడు సోషల్ మీడియాలో మాత్రం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. కోల్కతా జట్టు మాత్రం మూడు మ్యాచుల్లో రెండు విజయాలతో మంచి దూకుడు మీద ఉంది. మరి వీరి మధ్య ఏముందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక క్రికెటర్లు హీరోయిన్ ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు సంచలనమే.
Advertisements
Also Read:యాదాద్రి ఈవో ఓవరాక్షన్..!