క్రికెటర్స్, హీరోయిన్స్ ని పెళ్ళాడడం చాలా కాలంగా వస్తోన్న ఆనవాయితి. ఇప్పుడు అది మరోసారి రిపీట్ అయ్యింది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ అందాల నటి అతియా శెట్టిని వివాహమాడాడు. గత కొద్దికాలంగా వీరిద్దరూ చనువుగా ఉండడం తెలిసిందే..! కాగా నేడు వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. అతియాశెట్టి..బాలీవుడ్ సీనియర్ నటుడు, అతియా తండ్రి సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్‌లో పెళ్లి చేసుకున్నారు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతియా లెహంగాలో, రాహుల్ షేర్వాణీలో ఉన్నారు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి 100 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారని సమాచారం తెలుస్తోంది. నూతన జంట కేఎల్ రాహుల్, అతియా శెట్టి త్వరలోనే ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారని సమాచారం.