భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇప్పటికే సిడ్నీకి చేరుకున్న విషయం విదితమే. క్వారంటైన్‌లో ప్రస్తుతం ఆటగాళ్లు సమయం గడుపుతున్నారు. దాంతోపాటు నెట్స్ లోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే భారత జట్టులో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. రాహుల్ ఆస్ట్రేలియా పర్యటనలో 69 రోజుల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడనున్నాడు. అయితే అక్కడ ఉన్నందుకు గాను తన గర్ల్ ఫ్రెండ్ అథియా శెట్టిని ఎంతగానో మిస్ అవుతున్నానని అతను తాజాగా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ పెట్టాడు. యూనో కార్డ్‌లను పట్టుకుని ఉన్న ఓ ఫోటోను అతను ఆ పోస్ట్‌లో పెట్టాడు.
మిస్ యూనో నైట్స్ అని పోస్ట్ చేసిన రాహుల్ ఆ పోస్ట్‌ను మయాంక్ అగర్వాల్, ఆశితా సూద్, అథియా శెట్టి, సినన్‌కదర్, రితిక్ భసిన్‌లకు ట్యాగ్ చేశాడు. దానికి అథియా శెట్టి గ్రీట్ కార్డ్స్ అని కామెంట్ పెట్టింది. అయితే కేఎల్ రాహుల్, అథియా శెట్టిలు గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఇద్దరిలో ఎవరూ ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. కాకపోతే ఇద్దరు బర్త్ డేల సమయాల్లో, ఇతర సందర్భాల్లో ఒకర్నొకరు గ్రీట్ చేసుకుంటుంటారు. అలాగే ఆమె బర్త్ డే సందర్భంగా ఒకసారి రాహుల్ ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ విషయం నిజమేనని తెలుస్తోంది.
కాగా కేఎల్ రాహుల్ ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టోర్నీలో పంజాబ్ 6వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ జరిగిన వెంటనే అతను టీమిండియా జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. దీంతో తన గర్ల్ ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నానని అతను పరోక్షంగా చెబుతూ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టాడు. ఇక టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ20లు, టెస్టులు ఆడనుంది. నవంబర్ 27న సిడ్నీలో ఆసీస్‌తో ఇండియా తొలి వన్డే ఆడుతుంది.