నగర పంచాయితీ సెక్రటరిపై మాజీ వాలంటీర్ కత్తితో దాడి చేశాడు. ఆ దారుణ ఘటన దాచేపల్లి నగర పంచాయతీలోని నారాయణపురంలో చోటు చేసుకుంది. నారాయణపురంలో అంజుమన్ కమిటీ ఎన్నికపై ఎన్నిక నిర్వహించారు.
అందులో భాగంగా ఏర్పడ్డ రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. గొడవ కారణంగా నగర పంచాయతీ సెక్రటరీ జాన్ పీరా.. వాలంటీర్ గా అలీ అనే వ్యక్తిని తీసివేశారు. దీంతో సెక్రటరీపై కక్ష పెంచుకున్నాడు అలీ. అరుదైన సమయంకోసం వేచి చూశాడు.
ఆధిపత్య పోరు, పాతకక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం కర్రలు, కత్తులతో 25 మందికి పైగా సెక్రటరీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెక్రటరీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితున్ని దాచేపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్లకు తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. నగరపంచాయతీ కాకముందు జాన్ ఫీరా.. దాచేపల్లి పంచాయితీ సెక్రటరీగా విధులు నిర్వహించేవారు.