అమితాబ్ బచ్చన్, రశ్మిక మందన్నా లీడ్ రోల్స్ నటించిన చిత్రం గుడ్ బై… ఈ సినిమాకు వికాస్ బాహల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో స్పెషల్ థ్యాంక్యు కేటగిరి కోటాలో క్రితి సనన్ పేరు వేశారు. దీంతో అసలు క్రితి సనన్ కు ఈ సినిమాకు సంబంధం ఏంటని వెతికే పనిలో అభిమానులు పడ్డారు.
అయితే దీని వెనక ఓ ఆసక్తికర విషయం ఉన్నట్టు దర్శకుడు వికాస్ బాహల్ ఇటీవల వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా టైటిల్ ‘గుడ్ బై’గురించి వివరిస్తూ ఇది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ దగ్గర నుంచి వచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం…
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ రోజు బాహల్ ను కృతి సనన్ కలిసింది. షూటింగ్ ఎలా జరుగుతుందని ఆ సమయంలో ఆయన్ని అడిగి తెలుసుకున్నారు. అలా ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు. ఈ క్రమమంలో సినిమాకు గుడ్ బై అనే టైటిల్ అయితే పర్ ఫెక్ట్ సూట్ అవుతుందని కృతి చెప్పేశారు.
దీంతో ఆలోచనలో పడ్డ బాహల్ అవును ఈ సినిమాకు ఈ పేరు బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోందని ఆలోచనలో పడ్డారు. వెంటనే ఈ విషయాన్ని అమితాబ్ తో చర్చించారు. చివరకు ఈ టైటిల్ కే అమితాబ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డైరెక్టర్ గుడ్ బై అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అందుకే స్పెషల్ కేటగిరి లో క్రితి సనన్ పేరు దర్శకుడు వేశారు.