చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాల్సిన సమయం వచ్చేసిందని ఎద్దేవా చేశారు వైసీపీ నేత కొడాలి నాని. పోలీసుల గురించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక మీ అంతు తేలుస్తానని పోలీసులను చంద్రబాబు హెచ్చరిస్తున్నాడని మండిపడ్డారు.
గన్నవరంకు వెళ్లిన చంద్రబాబు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. రాజ్యాంగం ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.
నారా లోకేష్ బ్రెయిన్ లెస్ కిడ్ అని.. తన పిచ్చి వాగుడుని చంద్రబాబుకు అంటించినట్టున్నాడని సెటైర్లు వేశారు. సీఎం జగన్ పై చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయనకు బాలకృష్ణ పూనినట్టున్నాడని ఎద్దేవా చేశారు.
గన్నవరంకు పట్టాభిని పంపింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. గన్నవరం ఘటనలో టీడీపీ కార్యకర్తలకు చిన్న గీత కూడా పడలేదన్నారు. చంద్రబాబును జైల్లో కానీ లేదా పిచ్చాసుపత్రిలో కానీ పెట్టాలని వ్యాఖ్యానించారు కొడాలి నాని.