తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ చేస్తున్న యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబు డీ ఫాల్టర్ అయ్యారని విమర్శించారు. కొడాలి నాని బూతులు మాట్లాడతాడని టీడీపీ వాళ్లు తిడుతున్నారు.
మరి లోకేష్ భాష ఎలా ఉంది? జగన్ ను నువ్వు రాయలసీమలోనే పుట్టావా? అని అడుగుతున్నాడు. అదే మాట మేము అంటే గోల గోల చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. జగన్ డిఎన్ఏ రాయలసీమ.. లోకేష్ డిఎన్ఏ తెలంగాణ.. లోకేష్ తెలంగాణలో పుట్టి ఇక్కడ ఎందుకు? అని ప్రశ్నించారు కొడాలి నాని.
కాగా అంతకముందు కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని దుయ్యబట్టారు. జగన్ నిలువు దోపిడీకి ప్రజలు బలయిపోతున్నారని అన్నారు.
తన జీవితంలో ఇంత దోపిడీదారున్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. జగన్ రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కుంటున్నాడని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను ప్రజలే కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరించారు.