ఏపీ మంత్రి కొడాలి నానితో
‘తొలివెలుగు’ క్వశ్చన్ అండ్ ఆన్సర్
చంద్రబాబు మీ ప్రభుత్వం అన్ని అంశాల్లో ఫెయిలయ్యిందని అంటున్నారు.. మీరేమంటారు?
చంద్రబాబు ఒక పిట్టల దొర.. పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఏదన్నా అంటాడు.
రాజధానిగా అమరావతి నిజంగానే మార్చేస్తారా?
రాజధాని ఇక్కడి నుంచి తరలిపోతుందని, పోలవరం పూర్తి కాదని చంద్రబాబు అండ్ కో ఖాళీగా వుండి పనిలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అంతే..
మీ పార్టీవాళ్లు చేస్తున్న ఆరోపణలకు సుజనా చౌదరి సవాల్ విసిరారు. మీ రియాక్షన్ ఏంటి?
సుజనా చౌదరి పుట్టుకతోనే కోటీశ్వరుడు, ఆయనకు బ్యాంకుల్లో అప్పుందని అంటున్నాడు. అప్పు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తుంది? ఎలాంటి భయం లేనప్పడు ఆయన అసలు పార్టీ ఎందుకు మారాడు? చంద్రబాబు పక్కనే వుండి సుజనాచౌదరి ఆయన్ని పూర్తిగా ముంచేశాడు.
రాజధాని ప్రకటించక ముందే ఇక్కడ టీడీపీ వాళ్లు భూములు కొన్నారని మీరు గట్టిగా చెప్పగలరా?
రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది.. ఇది వాస్తవం.
ఇంతకీ అమరావతి ఉంటుందా? ఉండదా?
రాజధాని ఇక్కడే ఉంటుంది.. పోలవరం కూడా అనుకున్న సమయంలో పూర్తి చేస్తాం.