వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు సమగ్రమైన బిల్లు పెడతామన్నారు కొడాలి నాని. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్నారు. చంద్రబాబుకి దమ్ముంటే మోడీకి హిందీలో గాని ఇంగ్లీష్ లోగాని లేఖ రాయాలని లేదంటే ఢిల్లీ వెళ్లి అడగాలన్నారు. అలా అడిగితే 48 గంటల్లో అండమాన్ లేదా తీహార్ జైలు లో పెడతారని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విడిపోయాక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సినీ పరిశ్రమని గాలికి వదిలేసాడని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమ ఇబ్బందులపై కమిటీ వేసి సమస్య పరిష్కారం చేసిన వ్యక్తి సీఎం జగన్ ని పేర్కొన్నారు.
ఇండస్ట్రీ లో అపారమైన అనుభవం ఉన్న పెద్ద మనిషిగా చిరంజీవి తో కలిసి సీఎం జగన్ సమస్యను పరిష్కరించారని తెలిపారు. నిన్నటి సమావేశం పూర్తిగా అధికారికంగా జరిగింది. సీఎస్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారన్నారు.
సినీమా వాళ్ళని బెదిరించారు, పిలిపించుకున్నారు అని చంద్రబాబు గాలి విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశం లేక పార్లమెంట్ లో క్యాసినో, కోడిపందాలు గురించి టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నారని అన్నారు. కమ్మ, కాపు కులాలపై మళ్ళీ వివాదాలు సృష్టించాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.