మంత్రి కొడాలి మరోసారి మీడియా సెన్సార్ కట్‌లకు పనిచెప్పారు. మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చిల్లర రాజకీయం తనకు చిన్నప్పటి నుంచే తెలుసంటూ మండిపడ్డారు. టీడీపీ అనుకూల మీడియాలో తమపై అడ్డమైన వాళ్లతో బూతులు తిట్టిస్తారని ఆరోపించారు. రెండెకరాల పొలం ఉన్న చంద్రబాబు.. రెండు లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నాడని విమర్శించారు.. టీడీపీ నేతలు ఈక ముక్క కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పేదలకు అందించే ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని కొడాలి స్పష్టం చేశారు. ఎన్ని కేసులు వేసినా అవి పరిష్కరించుకొని మహిళల పేరునే రిజష్ట్రేషన్ చేసి ఇళ్ళస్దలాలు అందిస్తామని చెప్పారు. తనపై ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానన్నారు కొడాలి.