విజయవాడ : ఉప రాష్ట్రపతి… చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అందులో ఇప్పుడు ఆ పదవిలో ఉన్న వ్యక్తి మన తెలుగువారు…మన వెంకయ్య.. అచ్చతెలుగు హుందాతనానికి నిలువెత్తు రూపం ముప్పవరపు వెంకయ్య నాయుడు. అంతెత్తు పెద్దమనిషిని చూడగానే ఎవరికైనా గౌరవం. ఉప రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అరుదైన స్వాగతం పలికారు. మంత్రి గారి వేషం, అవతారం చూసి ఉప రాష్ట్రపతితోపాటు అంతా విస్తుపోయారు. పక్కా మాస్ లీడరులా కనిపించారు నాని. జీన్ పాంటు…చెమట్లు గారే ఫేస్‌తో స్వాగతం పలికిన మంత్రి గారిని చూసి ఉప రాష్ట్రపతి ప్రతి నమస్కారం చేశారు. ఆ సమయంలో ఆయన ముఖంలో అనేక భావాలు కనిపించాయి అందరికీ.. నెటిజన్లు ట్విట్టర్లో ఈ సీన్ చూసి రకరకాల కామెంట్స్ చేసేశారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » మన మంత్రి నాని గారు.. ! మాంచి మాసు..