సీఎం కేసీఆర్‌పై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర విమర్శులు చేశారు. పోరాడి సాధించుకున్నతెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కోదండరాం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యమ పార్టీ అని ఆదరించి రెండుసార్లు అధికారంలో కూర్చోబెడితే.. కేసీఆర్ మాత్రం ఆంధ్ర పెత్తందార్లు, కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిజాయతీ కలిగిన మన కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే కేసీఆర్.. ఇవాళ తెలంగాణలో ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి..ఇప్పుడు అదే ఉద్యకారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని కోదండరాం ఫైరయ్యారు. కేసీఆర్కు అధికార దాహం తప్పా.. ప్రజల కష్టాలు పట్టించుకోరని విమర్శించారు. ఏదో రకంగా ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా నిత్యం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Advertisements
జయశంకర్‌ను కేసీఆర్ అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ ఆశయాల కోసం టీజేఎస్ పనిచేస్తోందని కోదండరాం స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు నమ్మివరి వేయకుండా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.