మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి. 2022లో కేసీఆర్ సర్కార్ రైతుల ఉసురు పొసుకున్నాడన్నారు. కేసీఆర్ సర్కార్ రైతు కష్టాలను పట్టించుకోలేదని, కరోనా సమంలో కూడా రైతులు నిరంతరం పని చేశారన్నారు. రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.
ఈ సంవత్సరం ప్రభుత్వం వడ్లు కొనక రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారన్నారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫి హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయించిన నిధులు అంకెల గారడీకే పరిమితం అయ్యాయన్నారు.
భూరికార్డ్‌ల ప్రక్షాళనలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, ధరణి పోర్టల్ తో భూస్వాములకు న్యాయం జరిగిందన్నారు. చిన్నసన్నకారు రైతులకు అన్యాయం జరుగుతోందని వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు సాయం అందుతోందన్నారు. పంట నష్ట పరిహారం అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.