రైతులు తమ హక్కులను రక్షించుకోవడం కోసమే ఉద్యమాలు చేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి సంఘీభావంగా మంగళవారం హైదరాబాదులో అఖిలపక్షం మద్దతుతో నిర్వహించిన రైతు ర్యాలీలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సాగు చట్టాలతో కార్పొరేట్ కంపెనీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆయన విమర్శించారు. మార్కెట్లలో దోపిడీ శక్తుల నుంచి తమకు రక్షణ కావాలని రైతులు కోరుతున్నారని కోదండరాం పేర్కొన్నారు.