బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా కాంట్రాక్టర్ల కోసమే నడుస్తోందని ఆయన ఆరోపించారు.
జగిత్యాల పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డిస్కంలకు బకాయిలను వెంటనే చెల్లించి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న రాష్ట్రంలోని విద్యుత్ భవనాల ముందు ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు.
ఆత్మహత్యకు పాల్పడ్డ నరసింగాపూర్ రైతు జలపతి రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.