తెలంగాణలో 50వేల పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై టీజేఎస్ నేత కోదండరాం స్పందించారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నెలలోపే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తనను తాను రక్షించుకోవటానికే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న కోదండరాం… రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తునందునే ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారన్నారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అంశాలను భయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్ మభ్యపెడుతున్నారని, ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్న నమ్మకం లేదని కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. జోనల్ వ్యవస్థ తేలకుండా ఉద్యోగాలు భర్తీ చేయలేరని, కమిటీ పేరుతో కాలయాపన చేసే కుట్ర చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు.