హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై ఆయన కుమార్తె విజయలక్ష్మ అసలేం జరిగిందో వివరాలు అందించారు. ఉదయం టిఫిన్ చేశాక నాన్న ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లారని, అరగంటకు పైగా కిందకు రాకపోవడంతో పైకి వెళ్లి చూశామని ఆమె చెప్పారు. తాను పైకి వెళ్లి చూసేసరికి ఉరి వేసుకుని కనిపించారని తెలిపారు. డ్రైవర్, గన్‌మ్యాన్ సాయంతో ఆయనను ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పోలీసులు కోడెల కుమార్తె విజయలక్ష్మి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. తన తండ్రి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలియజేశారు.