గుంటూరు: మాజీ సభాపతి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావ్ అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజల సహకారంతో ఈ అంత్యక్రియల్ని నిర్వహిస్తామని కోడెల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి స్పష్టంచేశారని టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు చెప్పారు. కోడెల మీద జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నది ముమ్మూటికీ వాస్తవమని, హత్య చేసిన ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపిస్తామనడంలో అర్ధం లేదని అన్నారు. ప్రభుత్వ హత్యకు జగన్ బాధ్యత వహించాలని చెప్పారు.